నా తల్లిని కావాలనే కారుతో ఢీకొట్టారు,,,,,బీజేపీ నేత సంచలనం
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:43 PM

 పుణెలో మంగళవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం రాజకీయ వర్గాల్లో పెను సంచలనానికి దారి తీసింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా తల్లి అర్షీన్ పూనావాలాపైకి ఒక కారు దూసుకురావడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని షెహజాద్ పూనావాలా వెల్లడిస్తూ.. మరిన్ని సంచలన కామెంట్లు చేశారు. తన తల్లిని ఎవరో కావాలనే కారుతో ఢీకొట్టారని అన్నారు. అలాగే ప్రమాద వీడియోను చూస్తుంటే.. తన రక్తం మరిగిపోతోదని పేర్కొన్నారు.


అసలేం జరిగిందంటే..?


ఈ ఘటనకు సంబంధించిన వివరాలను షెహజాద్ సోదరుడు, రాజకీయ విశ్లేషకుడు తెహసీన్ పూనావాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన తల్లి ఓ వృద్ధురాలని, ఆమె తన డ్రైవర్, అసిస్టెంట్‌తో కలిసి కారులో బయటకు వెళ్లారని తెలిపారు. మార్గమధ్యలో కారుకు గ్యాస్ నింపడం కోసం ఆగిన సమయంలో.. ఆమె కారు దిగి పక్కన నిలబడ్డారని చెప్పారు. అయితే సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు ఆమెను బలంగా ఢీకొట్టి, అక్కడి నుంచి ఆగకుండా పారిపోయిందని గుర్తు చేశారు. ఈ మొత్తం ఉదంతం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిందంటూ.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు.


మరోవైపు ఈ ఘటనపై స్పందించిన షెహజాద్ పూనావాలా.. కావాలనే ఎవరో తన తల్లిని కారుతో ఢీకొట్టారని అన్నారు. వీడియో చూస్తుంటే అలాగే అనిపిస్తోందని చెప్పారు. పుణె పోలీసులు వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూనే.. ఈ వీడియో చూస్తుంటే తన రక్తం మరిగిపోతుందన్నారు. అందరి పట్ల దయ, ప్రేమతో మెలిగే తన తల్లిని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నానంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. ముఖ్యంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తన తల్లి అర్షీన్ పూనావాలాను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారన్నారు. ఆమె శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయని.. త్వరలోనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని కూడా షెహజాద్ తెలిపారు.


ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కార్యాలయం స్పందించింది. పుణె పోలీసులు ఇప్పటికే పూనావాలా కుటుంబంతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, రాజకీయ కక్షల నేపథ్యంలోనే జరిగిందా? లేక ఇది మద్యం మత్తులో ఎవరైనా చేసి పనా ఇది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
US trade deal - a booster shot for India's AI hardware ecosystem Sun, Feb 08, 2026, 05:44 PM
PM Modi departs for India after concluding Malaysia visit Sun, Feb 08, 2026, 05:43 PM
Seychelles President Patrick Herminie arrives in New Delhi Sun, Feb 08, 2026, 05:38 PM
Assam CM targets Gaurav Gogoi over children's British citizenship Sun, Feb 08, 2026, 05:37 PM
T20 WC: Bethell, Brook hit fifty as England post 184/7 against Nepal Sun, Feb 08, 2026, 05:32 PM