|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:31 PM
AP: గుంటూరుకి వెళ్లిన జగన్.. వైసీపీ నేత అంబట రాంబాబు ఇంటికి వెళ్లారు. అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించారు. అంబటి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోందని, భయానక వాతావరణంలో పాలన జరుగుతోందని జగన్ విరుచుకుపడ్డారు.అంబటిని హత్య చేసేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని.. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడులు అత్యంత హేయం.. వీళ్లందరూ చేసిన తప్పేంటి?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Latest News