|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 04:06 PM
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, ఏలూరు జిల్లాలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ‘కోకో సిటీ’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కోకో సిటీలో సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అన్ని ప్రక్రియలు ఒకేచోట ఉండేలా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీనితో పాటు మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
Latest News