|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 04:05 PM
భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం టారిఫ్‌లను తగ్గించడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వాగతించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వాకల్చర్ రంగానికి గణనీయమైన ఊరటనిస్తుందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం, ఆక్వా రంగంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఒక వరం లాంటిదని ఆయన అభివర్ణించారు. దీనివల్ల రాష్ట్రంలోని రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.గతంలో అధిక టారిఫ్‌ల కారణంగా తగ్గిన ఎగుమతులు మళ్లీ పుంజుకుంటాయని, అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల పోటీతత్వం పెరుగుతుందని అచ్చెన్నాయుడు అన్నారు.
Latest News