|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:39 PM
ప్రస్తుతం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి ఎక్స్ వేదికగా స్పందిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్, తన తండ్రి ముద్రగడపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేక వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభద్రతాభావం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. జగన్ రాజకీయ లాభాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి రెడ్లకు అప్పగించి, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతే కాపులు గుర్తొస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబును ముందు పెట్టి అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే తరహాలో రేపు తన తండ్రి ముద్రగడను కూడా అలా చేయరని గ్యారెంటీ ఉందా? అని ఆమె వ్యాఖ్యానించారు.
Latest News