|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:03 PM
బెల్లీ ఆకారాన్ని బట్టి మీ ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కుండలాంటి బెల్లీ ఇన్సులిన్ నిరోధకత, ఉబ్బరం వల్ల వస్తుంది. దీనికి దాల్చిన చెక్క టీ, సోంపు, వాము టీ వంటివి మేలు చేస్తాయి. బెల్లీ కిందకి ఉబ్బిపోతే ఈస్ట్రోజెన్ పెరగడం కారణం, డాక్టర్‌ను సంప్రదించాలి. బొడ్డు పైకి కడుపు పెరగడానికి కార్టిసాల్ అసమతుల్యత, నిద్రలేమి కారణాలు, అశ్వగంధ మాత్రలు సూచిస్తారు. పౌచ్ లాంటి బెల్లీకి ప్రోటీన్ అధికంగా తీసుకోవాలి, కోర్ మజిల్ వర్కౌట్స్ చేయాలి.హైడ్రేషన్...ఎల్లప్పుడూ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచితే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. వీలైనంత ఎక్కువగా వాటర్ తాగితే జీర్ణక్రియ మెరుగై బెల్లీ ఫ్యాట్‌ని కరిగిస్తుంది. ప్రతి రోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం మంచిది. అలానే నీటి శాతం అధికంగా ఉన్న వాటర్‌మెలన్, ఆరెంజ్ వంటి జ్యూస్‌లను కూడా తాగొచ్చు. అయితే, కూల్‌డ్రింక్స్, సోడాలు తాగితే బరువు పెరిగే ముప్పు ఉంటుంది.ఫైబర్ కంటెంట్బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే సులువుగా జీర్ణమయ్యే ఫైబర్‌ని డైట్‌లో చేర్చుకోవాలి. ఫైబర్ ప్రోబయాటిక్‌గా పనిచేసి పేగుల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అందుకే ఫైబర్ పుష్కలంగా ఉండే స్వీట్ పొటాటో, అవకాడో, చిక్కుళ్లు వంటి ఫుడ్స్ తినాలి. ఇవి కడుపు నిండిన భావన కలిగించి ఆకలిని తగ్గిస్తాయి. సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా తినేవారిలో బెల్లీ ఫ్యాట్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రకమైన ఫైబర్ ఉండే ఫుడ్స్ తినాలి.
Latest News