|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 02:52 PM
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎమ్మిగనూరు మండల ప్రధాన కార్యదర్శులు ఎస్ తిమ్మన్న, ఉపాధ్యక్షులు సుమల ఆంథోనీ బుధవారం ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కేంద్ర బడ్జెట్‌లో దళిత, గిరిజనులకు ఘోర అన్యాయం జరిగిందని, సామాజిక న్యాయం పేరుతో మోసం చేశారని ఆరోపించారు. ఎస్సీఎస్పీ, టీఎస్పీ నిధులు జనాభా శాతానికి తగ్గట్టుగా లేవని, విద్యా, హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లు, మౌలిక సదుపాయాలు సరిపడకపోవడం, ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు లేమి వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు.భారతదేశ జనాభాలో దళితులు (SC) 16.6 శాతం, గిరిజనులు (ST) 8.8 శాతం ఉన్నప్పటికీ, వారి అభివృద్ధికి కేటాయించిన నిధులు జనాభా శాతానికి అనుగుణంగా లేవు.మొత్తం కేంద్ర బడ్జెట్ వ్యయం సుమారు ₹48 లక్షల కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ సాధారణ పథకాలకు 10,94,513 కోట్లు కేటాయించగా దళితుల కోసం SC ఉపప్రణాళిక (SCSP) కింద కేటాయింపు సుమారు ₹1.65 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు . ఇది మొత్తం బడ్జెట్‌లో కేవలం 15 శాతం మాత్రమే. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ లో 3 వేల కోట్లు తగ్గింది.
Latest News