అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి శ్రుతి హాసన్ అండ
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 06:35 AM

ప్రముఖ నటి శ్రుతి హాసన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడారు. సకాలంలో ఆమె అందించిన సహాయంతో ఓ కుటుంబంలో వెలుగులు నిండాయి'ఆళ్వి' అనే చిన్నారి MSMD మెండెలియన్ ససెప్టబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్ అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చిన్నారికి అత్యవసరంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రుతి హాసన్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.చిన్నారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, నిపుణులైన వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూశారు. శ్రుతి చొరవతో ఆళ్వికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగి, పాప పూర్తిగా కోలుకుంది.దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. "మా పాప ప్రాణాలు దక్కడానికి శ్రుతి గారే కారణం. ఆమె చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం" అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ విషయం తెలియడంతో శ్రుతి హాసన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Latest News
Arsenal reach Carabao Cup final after last-gasp Havertz goal Wed, Feb 04, 2026, 12:53 PM
US Senators accuse UBS of blocking Holocaust truth Wed, Feb 04, 2026, 12:48 PM
CM Mamata files fresh plea in SC to stop voter name deletions during SIR in Bengal Wed, Feb 04, 2026, 12:37 PM
TN records over one lakh new cancer cases in 2025; Chennai reports highest count Wed, Feb 04, 2026, 12:28 PM
Trump calls for federal role in US elections Wed, Feb 04, 2026, 12:23 PM