|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:45 PM
భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం ఇరుదేశాలకు సంబంధించి ప్రధాన దౌత్య విజయంగా పేర్కొంటున్నారు. వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్‌లో అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జనవరిలోనే రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య బంధాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి వివిధ అంశాల కారణంగా ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించారు. ఇలాంటి సంక్లిష్ట వాతావరణంలో భారత్‍లో రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో వాణిజ్య ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా, భారత్ మధ్య బలమైన స్నేహం వల్లే ఈ ఒప్పందానికి అంగీకారం లభించిందని, ఇప్పటి నుంచి రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సెర్గియో అన్నారు.
Latest News