|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:43 PM
రోహిత్ శర్మ, దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'పద్మశ్రీ' అందుకోవడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది తనకు, తన కుటుంబానికి చాలా ప్రత్యేకమైన క్షణమని, దేశం కోసం మ్యాచ్‌లు గెలిచే తన ప్రయత్నం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ వీడియోలో రోహిత్ మాట్లాడాడు."పద్మశ్రీ పురస్కారం అందుకోవడం నాకు, నా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన సందర్భం. ఈ గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా కెరీర్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా దేశం కోసం మ్యాచ్‌లు, ట్రోఫీలు గెలిచే నా ప్రయత్నం ఎల్లప్పుడూ కొనసాగుతుంది. ధన్యవాదాలు. జై హింద్" అని రోహిత్ పేర్కొన్నాడు.
Latest News