|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:09 PM
రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు/పీసీసీలు, ఎమ్మెల్యేలు/ఏసీసీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు/మాజీ ఎమ్మెల్సీలు, పీఏసీ, సీఈసీ, ఎస్‌ఈసీ మెంబర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కమ్యూనిటీ విభాగాల అధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)లతో వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సమావేశంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం ఉద్యమాన్ని ఉద్ధృతంగా చేపడుతున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటూ రైతులకు సాగు, త్రాగు నీటిని దూరం చేస్తున్నారని ఆరోపించారు.రాయలసీమకు జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి నిరసనగా ఫిబ్రవరి 5వ తేదీ (గురువారం) ఉదయం 10:00 గంటలకు నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ ద్వారా రాయలసీమ ప్రజల గళాన్ని ఎలుగెత్తి చాటుతామన్నారు.
Latest News