ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు చేపట్టాలి
 

by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:07 PM

తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డా. శ్రీకాంత్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నాయకులు తిరుమల లడ్డూ విషయంపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఇప్పటికే స్పష్టమైందన్నారు. అయినప్పటికీ కొందరు తప్పుడు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి దుష్ప్రచారం కొనసాగించడం తీవ్రంగా ఖండనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ప్రజలను, భక్తులను తప్పుదారి పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.తిరుమల లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి పవిత్ర ప్రసాదంపై రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

Latest News
LS adjourned till noon amid constant sloganeering from Oppn MPs Wed, Feb 04, 2026, 11:18 AM
CM Mamata Banerjee reaches SC for Bengal SIR hearing Wed, Feb 04, 2026, 10:52 AM
Dense fog grips Delhi; low visibility procedures in place at IGI Airport Wed, Feb 04, 2026, 10:43 AM
FC Barcelona ease past Albacete to reach Copa del Rey SF Wed, Feb 04, 2026, 10:40 AM
Too early to judge India-US trade deal, assessment only after implementation: Mayawati Tue, Feb 03, 2026, 04:22 PM