|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:06 PM
AP: వినుకొండ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వైసీపీ నేతలు చేపట్టిన ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ను నెట్టివేసిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు 27 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
Latest News