|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 02:59 PM
రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ... రాజకీయంగా ప్రశ్నించే వారిపై చంద్రబాబు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఎవరో ఏదో చేస్తారని భయపడే రోజులు లేవు. అలా భయపడేవారెవరూ ఇక్కడ లేరు. ప్రభుత్వ దుర్మార్గాలపై పార్టీ కార్యక్రమాలు చేపడతాం. పెట్రోలు బాంబులు వేయడం అనే విష సంస్కృతిని చంద్రబాబు మళ్లీ తెచ్చారు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు దేశమంతా తప్పుపడుతోంది. క్షమాపణ చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైయస్సార్ సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు అని మండిపడ్డారు.
Latest News