|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 06:20 PM
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఛాతీ, చేయి, భుజం, వెన్ను, కాళ్లు, దవడ, మెడ భాగాల్లో నొప్పి వస్తుంది. తరచుగా తలనొప్పి, కడుపునొప్పి, ఉబ్బరం కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి సంకేతాలు. శ్వాస తీసుకునేటప్పుడు నొప్పి కూడా గుండె సమస్యలకు దారితీయవచ్చు. షుగర్ ఉన్నవారు ఈ లక్షణాలను గమనించి వెంటనే కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, క్రమం తప్పకుండా నడవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.ఎడమ లేదా రెండు చేతుల్లో నొప్పి ఉంటుంది. నెమ్మదిగా నొప్పి ఉంటుంది. ఇది గుండెపై ఒత్తిడి పెరిగి వచ్చే నొప్పి. అందుకే, దీనిని అస్సలే నిర్లక్ష్యం చేయొద్దు. ముందుగానే గుర్తించాలి. ఎడమ చేతులు లేదా రెండు చేతుల్లో నెమ్మదిగా నొప్పి వస్తుంటే దానిని గమనించి ముందుగానే అలర్ట్ అవ్వాలి. లేదంటే సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి.అదే విధంగా, ఎక్కువగా నడిస్తే కాళ్ళలో నొప్పి రావడం కామన్. కానీ, మనం రెస్ట్‌లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా నొప్పి వచ్చినా, తిమ్మిరిగా అనిపించినా కూడా అలర్ట్ అవ్వాలి. కాళ్ళలో ధమనులు మూసుకుపోతే ఇలా జరుగుతుంది. కాళ్ళలో నొప్పి, తిమ్మిరిగా ఉంటుంది.అప్పర్ బ్యాక్, మధ్య భాగంలో వెన్నునొప్పి ఉంటుంది. ఆ భాగమంతా మొద్దుబారినట్లుగా ఉండి పిండేసినట్లుగా ఉంటే ఆలోచించాల్సిందే. ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదు. ప్రతీసారి అలానే ఉంటే మాత్రం సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి. వెంటనే అలర్ట్ అవ్వాలి.
Latest News