|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:12 PM
భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం షూటింగ్ క్రీడలో మాత్రం మెత్తబడింది. భద్రతా కారణాలను సాకుగా చూపి క్రికెట్ జట్టును భారత్‌కు పంపేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ తాజాగా తన దేశ షూటింగ్ జట్టు న్యూఢిల్లీలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించింది.క్రికెట్ జట్టు విషయంలో చూపిన భద్రతా ఆందోళనలు షూటింగ్ జట్టుకు వర్తించవని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలను ఆ దేశం ఉదహరించింది. క్రికెట్ జట్టుతో పోలిస్తే షూటింగ్ బృందంలో సభ్యుల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి వీరికి భద్రత కల్పించడం సులభమని బంగ్లా భావిస్తోంది. అలాగే షూటింగ్ పోటీలు నియంత్రిత వాతావరణంలో, ఇండోర్ వేదికల్లో జరుగుతాయి. బహిరంగ మైదానాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌ల కంటే వీటికి రిస్క్ తక్కువని బంగ్లాదేశ్ అధికారులు విశ్లేషించారు.
Latest News