|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:10 PM
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశ ఈశాన్య ప్రాంతంలోని నార్టే డి సెంటాండర్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ సటెనాకు చెందిన ఒక చిన్న విమానం బుధవారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు సిబ్బంది, 13 మంది ప్రయాణికులతో సహా మొత్తం 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రముఖ రాజకీయ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త డియోజెనెస్ క్వింటెరో కూడా ఉండటంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.HK4709 రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ విమానం, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:42 గంటలకు కుకుటా విమానాశ్రయం నుంచి ఒకాన్యాకు బయలుదేరింది. 40 నిమిషాల ఈ ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు కురాసికా అనే మారుమూల గ్రామీణ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు గుర్తించారు. వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.విమానం ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన తర్వాత అందులో ఎవరూ ప్రాణాలతో మిగిలిలేరని అధికారులు ధ్రువీకరించినట్లు కొలంబియా రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Latest News