|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:09 PM
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన నాలుగో టీ20లో మంచి ఆరంభం లభించినా, దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 24 పరుగులు చేసిన శాంసన్, మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, అతడు ఔటైన తీరుపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.కామెంటరీలో గవాస్కర్ మాట్లాడుతూ.. "నాకు మొదట అనిపించింది ఏంటంటే, అతడికి ఫుట్‌వర్క్ ఏమాత్రం లేదు. బంతి ఏమైనా టర్న్ అయిందో లేదో కచ్చితంగా తెలియదు. కానీ, అతను అక్కడే నిలబడి, ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు" అని విశ్లేషించాడు. సంజూ పదేపదే ఇదే తరహాలో ఔటవుతున్నాడని సన్నీ అసహనం వ్యక్తం చేశాడు. "చెప్పినట్టుగానే, కాళ్ల కదలిక దాదాపుగా లేదు. లెగ్-స్టంప్ బయటకు వెళ్లి, మూడు స్టంప్‌లు బౌలర్‌కు కనిపించేలా చేశాడు. అలాంటప్పుడు బంతి మిస్ అయితే బౌలర్ స్టంప్‌లను కొడతాడు. సంజూ శాంసన్‌కు ఇది రెండోసారి ఇలా జరగడం" అని గవాస్కర్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
Latest News