|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:03 PM
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ ఆ జట్టుపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఒకవేళ పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఫన్నీ పోస్ట్ చేసింది.టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన వైఖరిని శుక్రవారం లేదా సోమవారం ప్రకటించనుంది. పీసీబీ చీఫ్ మోహసిన్ నఖ్వీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ తాజాగా స్పందించింది. "టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడంపై పాకిస్థాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఫిబ్రవరి 2న వాళ్లు తప్పుకుంటే మేము బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, ఫిబ్రవరి 7 కల్లా కొలంబో చేరుకోవడం ప్రయాణపరంగా పెద్ద తలనొప్పి. పైగా మా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌కు అస్సలు నిద్ర పట్టడం లేదు" అని ఐస్‌లాండ్ క్రికెట్ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో సరదాగా పేర్కొంది.
Latest News