|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:03 PM
AP: విజయనగరం, రేణిగుంటతో పాటు పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరంలో హోంగార్డ్ శ్రీనివాసరావు నివాసం, ఆయన బంధువుల ఇళ్లపై దాడులు జరిగాయి. విశాఖలో కూడా ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి తిరుమలేష్ నివాసాలపై కూడా దాడులు జరిగాయి. రేణిగుంట, తిరుపతి, నెల్లూరులోని మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Latest News