|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:53 AM
వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. డ్యామ్ నిర్మాణానికి అవసరమైన రాయిని సేకరించేందుకు రూ. 247 కోట్లు, లెఫ్ట్ సైడ్ కనెక్టివిటీలో నావిగేషన్ టన్నెల్ నిర్మాణం కోసం రూ. 4.49 కోట్ల అదనపు బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. డ్యామ్ నిర్మాణానికి 71.63 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం కాగా, గతంలో తవ్విన రాళ్లలో 50% మాత్రమే నాణ్యంగా ఉన్నాయని, అందువల్ల హిల్ నెం. 902 నుంచి కొత్తగా రాయిని వెలికితీయడానికి ఈ నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ పనులను మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ (MEIL)కు అప్పగించారు.
Latest News