|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:37 AM
రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని ప్రధాని మోడీ అన్నారు. గురువారం పార్లమెంట్ వద్ద మాట్లాడుతూ.. 'రాష్ట్రపతి వ్యాఖ్యలను సభ్యులంతా పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం. బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన గౌరవం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారింది. భారత్- ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ యువతకు ఎన్నో అవకాశాలు కల్పించనుంది' అని అన్నారు.
Latest News