|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:38 AM
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా మండిపడ్డారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మహిళకు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో జరిగిన అన్యాయంపై స్వయంగా బాధితురాలే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. అయన మాట్లాడుతూ... ఒక మహిళ మీ వద్దకు వచ్చి… మీ ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు, న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే కూడా స్పందించరా చంద్రబాబు? ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం? ఇదేనా మహిళా లోకానికి మీ దృష్టిలో ఉన్న విలువ?. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కీచక పర్వంగా మారింది. అరవ శ్రీధర్ పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా, వచ్చినది టీడీపీ నుంచే. ఆదిమూలం నుంచి అరవ శ్రీధర్ వరకు కీచకత్వం కొనసాగుతూనే ఉంది అని మండిపడ్డారు.
Latest News