మోకాలికి బ్యాండేజ్ వేసినందుకు రూ.5.8 లక్షల మెడికల్ బిల్లు
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 09:23 PM

అమెరికాలో వైద్యం ఎంత ఖరీదైనదో వివరిస్తూ ఒక భారతీయుడు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కేవలం మోకాలికి ఒక క్రేప్ బ్యాండేజ్ వేయించుకున్నందుకు తన చేతి నుంచి సుమారు రూ.1.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా రాత్రి ఐస్ స్కేటింగ్ చేస్తుండగా ఒక వ్యక్తికి మోకాలికి గాయమైంది. విపరీతమైన నొప్పి ఉండటంతో ఫ్రాక్చర్ అయ్యిందేమోనని భయపడి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లారు.


అమెరికాలో అంబులెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసి.. ఆయన అంబులెన్స్‌కు బదులుగా టాక్సీలో ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లారు. అక్కడ సుమారు గంటన్నర సమయం గడిపారు. డాక్టర్లు ఎక్స్‌ రే తీసి.. మోకాలిని పరీక్షించి, ఒక సాధారణ క్రేప్ బ్యాండేజ్ వేసి ఇంటికి పంపించారు. మూడు వారాల తర్వాత వచ్చిన బిల్లు చూసి ఆయన షాక్ అయ్యారు.


మొత్తం బిల్లు సుమారు 6,354 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.5.8 లక్షలు అయింది. అందులో హెల్త్ ఇన్సూరెన్స్ వాటా కింద బీమా కంపెనీ 4,500 డాలర్లు చెల్లించింది. దీంతో ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. అతను తన జేబు నుంచి 1,800 డాలర్లు అంటే దాదాపు రూ.1.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. కేవలం గంటన్నర సమయం ఆసుపత్రిలో ఉన్నందుకు ఇంత భారీ మొత్తం వసూలు చేయడంపై ఆయన తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు.


అమెరికాలో వైద్యం భరించలేనంత భారంగా మారుతుంటే.. భారత్‌లో అది ఎంత అందుబాటులో ఉందో వివరిస్తూ ఇటీవల ఒక అమెరికన్ మహిళ చేసిన పోస్ట్ కూడా చర్చకు వచ్చింది. 2025 సెప్టెంబర్‌లో క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళకు భారత్‌లో బొటనవేలుకు గాయమైంది. ఆమె స్థానిక ఆస్పత్రికి వెళ్తే.. వెయిటింగ్ లేకుండానే చికిత్స అందడమే కాకుండా ఆమెకు కేవలం రూ.50 మాత్రమే ఛార్జ్ చేశారు. దీంతో భారత్‌లో అతి సామాన్యులకు కూడా వైద్య సేవలు అందుబాటు ధరలో లభిస్తాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Latest News
Ponting backs Maxwell to overcome lean run, discover form in time for T20 WC Thu, Jan 29, 2026, 04:20 PM
Sensex, Nifty extend gains for 3rd day as economic survey boosts investor sentiment Thu, Jan 29, 2026, 04:11 PM
BSF, Punjab Police foil cross-border smuggling attempt; seize heroin, 21 pistols Thu, Jan 29, 2026, 04:10 PM
CM Yadav welcomes Padma Shri awardees at his residence Thu, Jan 29, 2026, 03:53 PM
Govt flags growing digital addiction, mental health crisis in children, youth Thu, Jan 29, 2026, 03:52 PM