|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:02 PM
ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మజ బుధవారం తిరువూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా, ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా కమిటీతో పాటు తిరువూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మహిళా మోర్చా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు. మహిళలకు, ప్రజలకు భారతీయ జనతా పార్టీని మరింత చేరువ చేసే కార్యక్రమాలు చేపట్టి, పార్టీని విజయపథంలో నడిపించాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Latest News