|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 06:59 PM
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే 3-0 ఆధిక్యం సాధించిన టీమ్‌ఇండియా, విశాఖపట్నంలో నాలుగో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్‌కు బదులుగా అర్ష్‌దీప్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.విశాఖపట్నంలో టీమ్ఇండియా నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడింది.విశాఖలో కివీస్, భారత్ టీ20ల్లో తలపడటం ఇదే తొలిసారి.విశాఖ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలమే. బుధవారం భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. రాత్రి వేళల్లో మంచు కురిసే అవకాశం ఉండటంతో భారీ లక్ష్యాలు కూడా ఇక్కడ సురక్షితం కాదు. చివరగా 2023లో ఇక్కడ జరిగిన టీ20లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఇక్కడి వికెట్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందుతుంది. మంచు ప్రభావం దృష్ట్యా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌ను ఎంచుకునే అవకాశాలున్నాయి.
Latest News