|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:04 PM
వండిన, నిల్వ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్లు తగ్గి కణాలు బలహీనపడతాయి. దీనికి మునగాకు పొడి పరిష్కారం చూపుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మునగాకు పొడిలో ఐరన్, కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు. రోజుకు 14 గ్రాముల మునగాకు పొడి 3 నెలలు తీసుకుంటే యాంటీఆక్సిడెంట్ నిల్వలు 44% పెరుగుతాయి. మునగాకు పొడిని అన్నం, టిఫిన్లలో కలుపుకుని, డికాషన్ లాగా, కారప్పొడిగా, వంటల్లోనూ వాడుకోవచ్చని సూచిస్తున్నారు.
Latest News