|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:37 PM
చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించనుంది. అలాగే ప్రాధాన్యత కలిగిన అంశాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి చేరుకుని అనంతరం కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పర్యావరణ శాఖ అధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గ్రీన్ కవర్ అంశంపై సమీక్ష నిర్వహించి, పచ్చదనం పెంపుదల, అటవీ విస్తీర్ణం విస్తరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.
Latest News