|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:29 PM
కెనడాకు చెందిన ఓ యువకుడు చేస్తున్న సైడ్-గిగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అతను తన మలాన్ని అమ్మి గతేడాది (2025) ఏకంగా రూ.3.4 లక్షలు సంపాదించాడు. ఇదేదో వింత సరదా కోసం కాదు, ప్రాణాలను కాపాడే ఓ కీలకమైన వైద్య ప్రక్రియ కోసం. ఈ అసాధారణ ఉద్యోగం ఇప్పుడు 'ఫేకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్' (FMT) అనే వైద్య విధానంపై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.కెనడాలోని చిల్లివాక్ నగరానికి చెందిన 20 ఏళ్ల ఈ యువకుడు, తన మల నమూనాలను ఓ వైద్య సంస్థకు విక్రయిస్తున్నాడు. ఈ నమూనాలను ఉపయోగించి 'క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్' అనే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందిస్తారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతమైన దాత నుంచి సేకరించిన మలాన్ని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి, రోగి పెద్దప్రేగులోకి ప్రవేశపెట్టడాన్నే ఎఫ్ఎమ్‌టీ అంటారు. దీనివల్ల రోగి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది, ఇన్ఫెక్షన్ నయమవుతుంది.
Latest News