|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:27 PM
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టునే ఫేవరెట్‌గా అభివర్ణించాడు. అదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు ఆటతీరును మార్చడంలో రోహిత్ శర్మ నాయకత్వ పటిమను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించాడు. రచయిత ఆర్. కౌశిక్ రాసిన 'ది రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ద్రవిడ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు 80 శాతం విజయాల రేటును కలిగి ఉంది. ఎన్నో ఒడిదొడుకులు ఉండే ఈ ఫార్మాట్‌లో ఇది అద్భుతమైన విషయం. అందుకే కచ్చితంగా భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటుంది. కానీ, నా చేదు అనుభవాల నుంచి నేను నేర్చుకున్నదేమిటంటే.. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
Latest News