|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 10:36 AM
మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆ రాష్ట్ర రాజకీయ ఉద్ధండుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషాద వార్తతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. తన రాజకీయ ప్రస్థానానికి పురిటిగడ్డ అయిన బారామతిలోనే ఆయన తుదిశ్వాస విడవడం అభిమానులను కలిచివేస్తోంది. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నేతగా పేరుగాంచిన అజిత్ పవార్ మరణవార్త మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరిన ఆయన విమానం, ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానంలో అజిత్ పవార్‌తో పాటు మరో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. అజిత్ పవార్ అక్కడికక్కడే మరణించినట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.
Latest News