|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 11:31 AM
గర్భస్రావ మందులు, మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల దుర్వినియోగం, అక్రమ అమ్మకాలపై రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో స్టాకిస్టులు, టోకు, చిల్లర వ్యాపారులను తనిఖీ చేసి, మందుల పంపిణీ డేటాను సేకరిస్తున్నారు. అక్రమ నిల్వ, అమ్మకాలపై దృష్టి సారించి, లైసెన్స్ పొందిన ప్రిస్క్రిప్షన్ల ఆధారంగానే అమ్మకాలు జరుగుతున్నాయో లేదో నిర్ధారిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు.
Latest News