|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:46 AM
భారత్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 171 దేశాల పౌరులకు 9 ఉప కేటగిరీల కింద ఈ-వీసా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని 31 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 6 ప్రధాన ఓడరేవుల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గురువారం రాజ్యసభకు తెలిపారు.ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆయన మాట్లాడుతూ.. పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. "స్వదేశ్ దర్శన్ 2.0" పథకం కింద 53 ప్రాజెక్టుల కోసం రూ. 2,208.27 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, 'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్' (CBDD) కార్యక్రమం కింద 36 ప్రాజెక్టులకు రూ. 648.11 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ నిధులను కేంద్రం విడుదల చేయగా, సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఏజెన్సీలు ప్రాజెక్టులను అమలు చేస్తాయని తెలిపారు.
Latest News