|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:56 PM
ఏపీలో తమ హయాంలో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటికి పైగా సంతకాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గవర్నర్‌కు సమర్పించనున్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన గవర్నర్‌ను కోరనున్నారు.ఈరోజు సాయంత్రం 4 గంటలకు జగన్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశం కానున్నారు. అంతకు ముందు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను ఆయన జెండా ఊపి లాంఛనంగా పంపిస్తారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.
Latest News