|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:53 PM
TG: వివాహేతర బంధం పెట్టుకున్న యువకుడిని ఆమె కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బూర్జుబావి గ్రామానికి చెందిన గడ్డం దావీద్(30)కు ఇదే గ్రామానికి చెందిన సోదరి వరసయ్యే యువతితో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఇళ్ల నుంచి పారిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చారు. ఈ క్రమంలో బుధవారం సర్పంచ్ ఎన్నికల్లో ఓటువేసి వెళ్తుండగా దావీద్‌పై యువతి భర్త, ఆమె సోదరుడు కర్రలతో దాడిచేసి చంపినట్లు సమాచారం.
Latest News