|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 11:12 PM
పెద్ద పెద్ద స్వెటర్స్, బ్లాంకెట్స్ ఉతకడమంటే చాలా పెద్ద పని. ఎంత బాగా ఉతికినా త్వరగా దుమ్ము వదలవు. పైగా వాటిని నీటిలో నుంచి బయటికి తీయాలంటే పై ప్రాణం పైకి వెళ్లిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈజీగా బ్లాంకెట్స్, పెద్ద పెద్ద స్వెటర్స్ వంటివి ఉతకడానికి కొన్ని కిటుకులు ఉన్నాయి. వీటితో మనం ఎక్కువగా శ్రమ పడకుండానే ఎంత పెద్ద బ్లాంకెట్స్ అయినా సరే ఈజీగా ఉతకొచ్చు. దీనికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. కేవలం రెండంటే రెండు పదార్థాలు ఉంటే ఎంత పెద్ద బ్లాంకెట్ అయినా కూడా చక్కగా ఉతుక్కోవచ్చు. మరి ఈజీగా బ్లాంకెట్స్‌ని ఎలా ఉతకాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
వేడి నీరు
పెద్ద టబ్
వాషింగ్ పౌడర్
షాంపూ
ఏం చేయాలి?
ఏం చేయాలి?
ముందుగా టబ్‌లో నీరు పోయాలి. అందులోనే వాషింగ్ పౌడర్ మీకు నచ్చిన షాంపూ కూడా వేయండి. ఇప్పుడు వాటన్నింటినీ బాగా కలపండి. తర్వాత బ్లాంకెట్స్‌ని అందులో ముంచండి. కొన్ని నిమిషాల పాటు అలానే ఉండనివ్వండి. బట్టలు ఎంతసేపు నానితే అంత బాగా మరకలు, దుమ్ము వదులుతాయి.
నానిన బ్లాంకెట్‌ని ఉతకడం
ఇప్పుడు రెండు మూడు గంటలు నానిన బ్లాంకెట్స్‌ని బయటికి తీసి ఎక్కడైనా మరకలు లేదా దుమ్ము ఉంటే అక్కడ ఎక్కువగా బ్రష్‌తో రాయండి. లేదంటే ఓ సారి చేతులతో రబ్ చేయండి. మరి చేతులతో రబ్ చేయలేమంటే కాళ్ళ కింద వేసి తొక్కినా పర్లేదు. అందులోని దుమ్మంతా బయటికి వెళ్లిపోతుంది.
నీటిలో తీయడం
ఇప్పుడు టబ్‌లో నీరు పోస్తూ ఆ నీటిలో ఉతికిన బ్లాంకెట్స్‌ని ముంచుతూ బయటికి తీయండి. ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నీసార్లు తీస్తూ. నీరంతా చక్కగా వచ్చేవవరకూ నీటిలో నుంచి ఒకటికి రెండు సార్లు తీయండి. తర్వాత కొద్దికొద్దిగా బ్లాంకెట్స్‌ని తీస్తూ నీటిని స్క్వీజ్ చేస్తూ ఓ చైర్‌పై నీరంతా పోయేవరకూ ఉంచండి.
పెద్దపెద్ద బ్లాంకెట్స్‌ని ఎలా ఉతకాలి?
సరిగ్గా ఆరేయడం
నీరంతా పోయిన తర్వాత బ్లాంకెట్‌ని ఓ సారి పిండి తర్వాత తీగపై ఆరేయండి. ఇలా వారానికోసారి ఈజీగానే బ్లాంకెట్స్‌ని ఉతకొచ్చు. ఇది బ్లాంకెట్స్ మాత్రమే కాదు. స్వెటర్స్ బరువున్న బట్టల్ని ఉతకడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి, బ్లాంకెట్స్ వంటి వాటిని ఉతికేటప్పుడు ముందుగా శ్రమపడకుండా ఇలా ఈజీగా ఉతకండి.