|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:35 PM
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్ల గురించి, ఎలక్ట్రిక్ బైక్‌ల గురించి విన్నాం. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ కూడా మార్కెట్లో అందుబాటులోకి వస్తోంది.పట్టణాలు, నగరాల్లో చిన్న అవసరాల కోసం ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారనుంది. అంతేకాకుండా ఆకర్షణీయంగా కనిపించే ప్రత్యేక వాహనం కలిగి ఉండాలనుకునే వారికి కూడా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ బాగా సరిపోతుంది. ఎలక్ట్రిక్ బైక్‌తో పోలిస్తే, ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఎలాంటి మార్గంలోనైనా సులభంగా నడిపే అవకాశం ఉంటుంది. వయస్సు పెరుగుతున్న పిల్లలు, యువత తమ రోజువారీ అవసరాల కోసం దీనిని సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. మెరుగైన బ్యాటరీ వ్యవస్థతో పాటు ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఇక దీని ధర ఎంతనేది ఇప్పుడు తెలుసుకుందాం.KTM కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ 2026 మోడల్‌ను డిసెంబర్ 17న మార్కెట్లోకి విడుదల చేసింది. తేలికైన అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారు చేసిన ఈ సైకిల్ పదునైన బాడీ లైన్లు, ఆధునిక LED లైటింగ్ సెటప్, డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. దీనికి అదనంగా స్పోర్టీ లుక్‌ను అందించే విధంగా రూపొందించారు.ఈ ఎలక్ట్రిక్ సైకిల్ విశాలమైన ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుంది. దీని వల్ల ఎంత దూరం ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది. అలాగే దీర్ఘ ప్రయాణాలకు అనువుగా ఎర్గోనామిక్‌గా ట్యూన్ చేసిన డిజైన్ ఇందులో ఉంది.ఈ సైకిల్‌లో శక్తివంతమైన, సమర్థవంతమైన బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ కేవలం పది నిమిషాల్లోనే 80 శాతం వరకు చార్జ్ అవుతుంది, తద్వారా డౌన్ టైమ్ గణనీయంగా తగ్గుతుంది. బిజీ షెడ్యూల్ ఉన్నవారు అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కసారి పూర్తిగా రీచార్జ్ చేస్తే 525 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగల సామర్థ్యం ఇందులో ఉంది.ఇందులో రైడింగ్ మోడ్‌లను చూపించే డిజిటల్ డిస్ప్లేను కూడా అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ప్రత్యేక యాప్ ద్వారా నావిగేషన్, రైడింగ్ ట్రాకింగ్, బ్యాటరీ స్టేటస్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే కీలెస్ స్టార్ట్, GPS ఆధారిత యాంటీ-థెఫ్ట్ ట్రాకింగ్, ఆటోమేటిక్ లైటింగ్, స్మార్ట్ పెడల్ అసిస్టెంట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.ఈ KTM ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.1,499 నుంచి ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ సైకిళ్లలో ఇది ఒకటిగా నిలుస్తోంది. ఈ సైకిల్‌ను ఈఎంఐ సదుపాయం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు, నెలకు రూ.149 నుంచి ప్రారంభమయ్యే ఆప్షన్ అందుబాటులో ఉంది. విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అంతేకాకుండా పర్యావరణ హితంగా ఉండే ఈ సైకిల్ నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషించనుంది.
Latest News