|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:33 PM
భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని జనవరి 24 వరకు పొడిగిస్తూ నోటమ్ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాలు పరస్పరం గగనతలాన్ని నిషేధించుకున్నాయి, ఇది గత 9 నెలలుగా కొనసాగుతోంది. ఈ నిషేధం వల్ల భారత విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఉత్తర భారతం నుంచి పశ్చిమాసియా, యూరప్ వంటి గమ్యస్థానాలకు వెళ్లే విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ కాలం, ఇంధన వినియోగం పెరుగుతోంది.
Latest News