|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:30 PM
బెంగళూరులో రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సతీష్ జిజెను ఒక మహిళ పదే పదే వేధించి, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 30 నుంచి తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేస్తూ, ప్రేమిస్తున్నానని ఒక మహిళ అసభ్యకరంగా మాట్లాడింది. నవంబర్ 7న కార్యాలయానికి వచ్చి, రక్తంతో రాసిన ప్రేమలేఖ ఇచ్చి, ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. వేధింపులు భరించలేక ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు చేయడంతో, మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News