|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:28 PM
ధర్మవరం టౌన్ నందు దివ్యాంగుల సమస్యల పరిష్కారం, హక్కులపై అవగాహన కల్పించేందుకు సక్షమ్ ధర్మవరం శాఖ – శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గారి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని, దివ్యాంగులు గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ముఖ్యంగా పెన్షన్లు, వైద్య సహాయం, ఉపాధి అవకాశాలు, గుర్తింపు కార్డులు, రవాణా సౌకర్యాలు వంటి అంశాల్లో ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు.
Latest News