|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 07:29 PM
భారత యువ క్రికెటర్, ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. పుణెలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.మ్యాచ్ జరుగుతున్నంతసేపు కడుపునొప్పితో ఇబ్బందిపడిన జైస్వాల్, ఆట ముగిసిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రమవడంతో ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అని వైద్యులు నిర్ధారించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అనంతరం మందులు వాడుతూ తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.ఇక, మ్యాచ్ విషయానికొస్తే ఈ హై-స్కోరింగ్ థ్రిల్లర్‌లో ముంబై మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జైస్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ అజింక్య రహానే (41 బంతుల్లో 72 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (22 బంతుల్లో 73) మెరుపు ఇన్నింగ్స్‌లతో ముంబైని గెలిపించారు. ముఖ్యంగా సర్ఫరాజ్ తన ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. చివర్లో అథర్వ అంకోలేకర్ (9 బంతుల్లో 26) కీలక పరుగులు చేయడంతో ముంబై మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
Latest News