|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:02 PM
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్‌పై ఇక ఎలాంటి అనుమానాలకు తావు లేదని, ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత అతను కచ్చితంగా ఆటకు వీడ్కోలు పలుకుతాడని భారత మాజీ ఆటగాడు, ధోనీ సహచరుడు రాబిన్ ఊతప్ప స్పష్టం చేశాడు. సీఎస్‌కే ఫ్రాంచైజీ తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోవడం, అనుభవజ్ఞుల కంటే యువ ఆటగాళ్లపై భారీగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నాడు.నిన్న జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై ఈ విషయాన్ని రుజువు చేసింది. 19 ఏళ్ల ప్రశాంత్ వీర్, 20 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మ అనే ఇద్దరు యువ ఆటగాళ్లను చెరో రూ. 14.2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లుగా వారు నిలిచారు. ఈ పరిణామాలపై ఊతప్ప మాట్లాడుతూ.. "ఇక గోడ మీద రాత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కచ్చితంగా ధోనీకి చివరి సీజన్ అవుతుంది. అతను మళ్లీ ఆడతాడా? లేదా? అనే ఊహాగానాలకు ఇక చోటు లేదు. ఈ ఏడాదితో అతను పూర్తిగా ఆటకు వీడ్కోలు పలుకుతాడు" అని వ్యాఖ్యానించాడు.
Latest News