|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:01 PM
పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను బృహత్తర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లైడార్ సర్వే ద్వారా గుర్తించిన 9900 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన లేఅవుట్ ప్లాన్ డిజైన్ దశలో ఉందని ఆయన పేర్కొన్నారు.అమరావతి సచివాలయంలో పోలవరం స్పిల్ వే బ్యూటిఫికేషన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్కిటెక్ట్స్, ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం స్పిల్ వే నిర్మాణం తెలుగుదనం, రాష్ట్ర ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు.
Latest News