|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 02:30 PM
మాజీ ముఖ్యమంత్రి జగన్, సాక్షి పత్రికపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్యాంకుల రుణాల చెల్లింపులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తనను లక్ష్యంగా చేసుకుని సాక్షి పత్రిక వార్తలు రాయడాన్ని రఘురామ ప్రస్తావించారు. జగన్ పతనానికి తానే కారణమని నిర్ధారించుకున్నారని, దీనికి సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ట్వీట్ చేయడంపైనా స్పందిస్తూ ఆయన అరెస్టు కానున్నారని వెల్లడించారు. జగన్ పెట్టిన కేసుపైనే సుప్రీం తీర్పు వచ్చిందని రఘురామ పేర్కొన్నారు.
Latest News