|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 02:12 PM
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మందగిరికి చెందిన రంగమ్మ (36)కు, దేవనకొండ మండలం భైరవానికుంటకు చెందిన గొల్ల లింగమూర్తికి పదేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు పలుమార్లు పంచాయతీ పెట్టినా వారి సంబంధం ఆగలేదు. రంగమ్మ భర్త నాగేంద్ర, పత్తికొండలో వారిద్దరూ ఒక ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని లింగమూర్తిని తీవ్రంగా కొట్టాడు. గాయాలపాలైన లింగమూర్తిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మూడు రోజుల చికిత్స తర్వాత మరణించాడు. లింగమూర్తి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు 6 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ సంబంధం వల్ల రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.
Latest News