|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 11:36 AM
దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు అంతరాయానికి గురవుతున్నాయి. ఈ క్రమంలో ఉమెన్స్ టీ20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయల్దేరిన విమానం, పూర్ విజిబిలిటీ కారణంగా అధికారులు విజయవాడకు దారి మళ్లించారు. ఈ నెల 21, 23 తేదీల్లో శ్రీలంకతో మ్యాచ్ల కోసం మహిళా జట్టు విశాఖకు చేరుకోవాల్సి ఉంది. మరోవైపు, విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా పొగమంచు కారణంగా రద్దైంది.
Latest News