|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 04:22 PM
కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎపిఐఐసి డైరెక్టర్ దోమా జగదీష్ గుప్తా తెలిపారు. మంగళవారం సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో జిల్లా నెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలును స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు మంత్రి టీజీ భరత్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని, కష్టపడే క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నాగేశ్వర బాబు, కార్యదర్శి వంశీకృష్ణ పాల్గొన్నారు.
Latest News