|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 04:00 PM
AP: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందడితో పాటు కోడి పందేలా జోరు మొదలైంది. పందెం రాయుళ్లు కోట్లలో పందాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ప.గో జిల్లాలో జరిగే కోడి పందాలకు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, రాయలసీమతో పాటు విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కాగా పందెం పుంజులను బాదం, జీడిపప్పు, కోడిగుడ్డు, వేట మాంసం, ఆకుకూరలతో బలవర్ధకంగా మేపుతున్నారు. జాతి పుంజులు ఒక్కొక్కటి యాభై వేల నుండి రెండు లక్షల వరకు అమ్ముడుపోతున్నాయి. ఈ సంక్రాంతికి కోట్లలో పందాలు జరగడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది.
Latest News