అప్పులపై బహిరంగ చర్చకు మేము సిద్ధం
 

by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:42 PM

రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, బహిరంగ చర్చకు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సిద్ధమని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఆ చర్చ ఎప్పుడు, ఎక్కడో యనమల చెప్పాలని ఆయన కోరారు. రాజకీయాల్లో తనంత సీనియర్‌ లేడని, సంపద సృష్టించడం తనకు తెలుసని, అలా సంపద సృష్టించి అన్ని పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబుగారు, అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పని చేయకపోగా, 18 నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. భవిష్యత్‌ తరాలను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ తెస్తున్న డబ్బంతా ఏం చేస్తుందన్న దానికి సమాధానం చెప్పడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరి వెంకట్‌రెడ్డి ఆక్షేపించారు.

Latest News
IPL 2026: 'So excited to get down to Eden,' says Cam Green after being roped in by KKR Tue, Dec 16, 2025, 05:04 PM
Over 3000 Afghan refugees forcibly deported from Iran, Pakistan in single day Tue, Dec 16, 2025, 05:01 PM
GST rate revision has resulted in 5 per cent rise in revenue for states: Minister Tue, Dec 16, 2025, 04:59 PM
BJP Working President Nitin Nabin resigns from Bihar cabinet Tue, Dec 16, 2025, 04:59 PM
India's textiles exports see 4.6 pc growth in last 4 fiscals, exports rise in over 100 nations Tue, Dec 16, 2025, 04:35 PM