|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:42 AM
గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న 12వేలకు పైగా ఉపాధి హామీ ఉద్యోగులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నెల వేతనం ఆ నెల రావడం లేదని, రెండు, మూడు నెలలకు ఒకసారి వేతనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన పే స్కేల్ అమలు కాలేదని, కనీసం వేతనాలు కూడా సకాలంలో అందడం లేదని వాపోతున్నారు. కేంద్రం నుంచి నిధులు సకాలంలో రాకపోవడం, కేంద్రం విధిస్తున్న షరతులే వేతనాల ఆలస్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
Latest News